ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. నాలుగు ఓటములతో ఇప్పుడా టీమ్ టేబుల్లో అట్టడుగుకు పడిపోయింది. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తోనూ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత రాయల్స్ టీమ్ నైట్‌రైడర్స్‌ను ఓ ఫన్నీవీడియోతో టీజ్ చేసింది. ఆ టీమ్ ఓనర్ షారుక్ ఖాన్ ఐకానిక్ పోజును రాయల్స్ ప్లేయర్ కాపీ కొడుతున్న వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది.
బ్యాక్‌గ్రౌండ్‌లో సూపర్‌హిట్ మూవీ దిల్వాలే దుల్హనియా లేజాయేంగేలోని మ్యూజిక్ ప్లే చేస్తూ ఈ వీడియో పోస్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం మ్యాచ్ గెలిచిన తర్వాత రాయల్స్ మూడ్ ఇలా ఉందంటూ కామెంట్ చేసింది. మ్యాచ్ ఓడినా, గెలిచినా రాజస్థాన్ రాయల్స్ ప్రతిసారీ ఇలాంటి ఫన్నీ మీమ్స్, వీడియోలతో తమ అభిమానులను ఆకట్టుకుంటోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై 6 వికెట్లతో గెలిచిన రాయల్స్.. పాయింట్ల టేబుల్లో ప్రత్యర్థిని అట్టడుగుకు లాగి తాను పైకి ఎగబాకింది.