గురువారం 24 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 14, 2020 , 03:45:09

సాగర్‌ జలాశయం @563.60 అడుగులు

సాగర్‌ జలాశయం @563.60 అడుగులు

నందికొండ : శ్రీశైలం  జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు నిలకడగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్‌ క్రమంగా నీటిమట్టం పెరుగూ జలకళను సంతరించుకుంటుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590(312.50 టీఎంసీలు) అడుగులకు గురువారం సాయంత్రానికి 563.60అడుగులకు చేరి 240.8312 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 27అడుగుల(72టీఎంసీలు)మేర నీరు వచ్చి చేరితే నీటిమట్టం పూర్తిస్థాయి చేరుకుంటుంది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా సాగర్‌ రిజర్వాయర్‌కు  40,259క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా ఎస్‌ఎల్‌బీసీ నుంచి 2400, ఎడమకాల్వ ద్వారా 6022 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  

637.90 అడుగులకు మూసీ.. 

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రానికి 637.90(2.75 టీఎంసీలు) అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు.

 పులిచింతల 137.63అడుగులు.. 

చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 137.63(8.74 టీఎంసీలు)అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 1705 క్యూసెక్కులు వస్తుండగా 100క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  


logo