ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 14, 2020 , 03:45:18

భూసేకరణ పనులను వేగవంతం చేయాలి

భూసేకరణ పనులను వేగవంతం చేయాలి

  • n  శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ : నార్కట్‌పల్లి-అద్దంకి హైవే తిప్పర్తి మీదుగా వెళ్లే బైపాస్‌ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ సమస్యను పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న పలురకాల అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ సమస్యలను అధిగమించాలన్నారు. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌, పిల్లాయిపల్లి కాల్వ భూసేకరణపై క్షుణ్ణంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. కంబాలపల్లి అటవీ సమస్యపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఎఫ్‌ఓ శాంతారామ్‌, అటవీ, భూసేకరణ అధికారులు పాల్గొన్నారు. 


logo