బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 14, 2020 , 03:20:19

రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా

రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా

l     శాంతిభద్రతల పరిరక్షణలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం

l     పోలీస్‌ అధికారుల సమావేశంల  నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌

నల్లగొండ క్రైం : జైలు నుంచి విడుదలయ్యే నేరస్తులు, ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై నిఘాను మరింత పెంచాలని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం పోలీస్‌ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్ల దినసరి కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు.  అధికారులు అవినీతికి పాల్పడినట్లు తన దృష్టికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.  ఎదుర్కొనే అధికారులపై విచారణ చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.   ఇసుక అక్రమ రవాణా, గుట్కా, గంజాయి  ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. కొవిడ్‌పై అన్ని స్థాయిల్లో పోలీస్‌ అధికారులు గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని, విధిగా ప్రతిఒక్కరూ  ధరించేలా చూడాలని సూచించారు. పాజిటివ్‌ వ్యక్తుల్లో మానసిక ధైర్యం నింపే  తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ నర్మద, డీటీసీ ఏఎస్పీ సతీశ్‌, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రమణారెడ్డి, సీఐలు రవీందర్‌, సురేశ్‌, శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, గౌరునాయుడు, సదా నాగరాజు, బాలగోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ అనిల్‌కుమార్‌, పరమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo