సోమవారం 21 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 11, 2020 , 02:47:05

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌..

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌..

  • మద్యం అక్రమ రవాణాకు సహకరించినందుకు వేటు

చింతలపాలెం : మద్యం అక్రమ రవాణాకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. వివరాల్లోకెళ్తే.. మండల కేంద్రానికి చెందిన ఓ దుకాణం నుంచి మద్యాన్ని ఆంధ్రా ప్రాంతానికి అక్రమంగా తరలించేందుకు సహకరించిన కానిస్టేబుళ్లు సతీశ్‌, జానకీరాములును సస్పెండ్‌ చేస్తూ  ఎస్పీ భాస్కరన్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణాలు చేసినా, సహకరించినా చట్టరీత్యా కఠినచర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.logo