మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 11, 2020 , 02:02:16

ఏఎమ్మార్పీకి నీటి విడుదల

ఏఎమ్మార్పీకి నీటి విడుదల

  • వానకాలం సీజన్‌కు షెడ్యూల్‌ ప్రకటించిన అధికారులు
  • 120 రోజుల పాటు వారబందీ పద్ధతిలో విడుదల
  • 2.55 లక్షల ఎకరాలకు అందేలా చర్యలు
  • ఆరేళ్లుగా కొనసాగుతున్న నీటి విడుదల

నల్లగొండ : వానకాలం సీజన్‌  సాగు కోసంలో ఏఎమ్మార్పీ(ఎలిమినేటి మాధవరెడ్డి -శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌), ఎస్‌ఎల్‌బీసీ  పరిధిలోని పంట పొలాలకు  సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యంత్రాగం నీటిని విడుదల చేసింది. వారబందీ పద్ధతిలో ఈ ఏడాది డిసెంబర్‌ ఆరు వరకు ఈ నీటి విడుదల చేయాలని నిర్ణయించి దీనికి సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏఎమ్మార్పీ  హై, లో లెవెల్‌ కెనాల్‌కు సైతం నీటి విడుదల కొనసాగనుంది. ఇప్పటికే ఎస్‌ఎల్‌బీసీకి అధికారులు నీటి విడుదల చేయగా ఈ కాల్వలతో జిల్లాలో 90 శాతం భూములకు   సాగు నీరు అందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.  

వారబందీ పద్ధతిలో..                          

ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ పరిధిలోని హై, లోలెవల్‌ కాల్వలకు ఈ వానకాలం సీజన్‌లో సాగునీటికి సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం ఆశాఖ అధికారులు ప్రకటించారు. వాస్తవంగా ఆదివారమే నీటిని విడుదల చేసిన అధికారులు షెడ్యూల్‌ మాత్రం సోమవారం ప్రకటించారు. ఏఎమ్మార్పీ పరిధిలోని హైలెవల్‌ కాల్వకు  ఈ నెల 9 నుంచి డిసెంబర్‌ 6 వరకు 118 రోజుల పాటు ఈ నీటి విడుదల చేయనుండగా, లోలెవల్‌ కాల్వకు నవంబర్‌ 28 వరకు విడుదల చేయనున్నారు. అయితే లోలెవల్‌ కాల్వకు ఈనెల 3 వ తేదీనే నీటిని విడుదల చేయడంతో నవంబర్‌ 28 తుది గడువుగా నిర్ణయించారు. హై లెవల్‌ కాల్వ ద్వారా సాగర్‌ నియోజకవర్గంతో పాటు నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గాలకు నీరు అందుతుంది. లో లెవల్‌ కాల్వ ద్వారా సాగర్‌తో పాటు నల్లగొండ, మిర్యాలగూడ నకిరేకల్‌ నియోజక వర్గాలకు నీరు పారనుంది. 

 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు...

ఎస్‌ఎల్‌బీసీ పరిధిలోని హై, లో లెవల్‌ కాల్వలకు సుమారు 120 రోజుల పాటు నీటి విడుదల కొనసాగనున్న నేపథ్యంలో 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. హై లెవల్‌ కాల్వ పరిధిలో 55 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా వాటి పరిధిలో 2.35 లక్షల ఎకరాలు సాగు భూములు ఉన్నాయి. ఇందులో మూడు డివిజన్లకు డివిజన్‌-1 కింద అంగడిపేట పరిధిలో 18 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా గుర్రంపోడు డివిజన్‌ పరిధిలో 37 వ డిస్ట్రిబ్యూటరీ వరకు...నల్లగొండ డివిజన్‌ పరిధిలో 55 డిస్ట్రిబ్యూటరీ వరకు ఉన్నాయి. అయితే వారబందీ పద్ధ్దతిలో భాగంగా ఒక వారం అంగడిపేట, నల్లగొండ డివిజన్‌కు మరోవారం గుర్రంపోడు నల్లగొండ డివిజన్‌కు నీటిని  విడుదల చేయనున్నారు. నల్లగొండ డివిజన్‌కు రెగ్యులర్‌గా నీటి విడుదల జరుగనుండగా ఒక వారం 39, 40 డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేసి మరో వారం అయిటిపాముల పరిధిలోని 41 నుంచి 55 వరకు విడుదల చేయనున్నారు. అయితే ఈ 118 రోజుల్లో రెగ్యులర్‌గా 2200 క్యూసెక్కులు విడుదల  కానుండగా అందులో తాగునీటి కోసం 700 క్యూసెక్కులు పోను మిగిలిన 1500 క్యూసెక్కులు సాగునీటి కోసం ఉపయోగించనున్నారు. ఇక లో లెవల్‌ కాల్వ పరిధిలో 80 ఎకరాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం 45 వేల ఎకరాలకు 600 క్యూసెక్కులు చొప్పున ఒక వారం ఇచ్చి మరో వారం బంద్‌ చేస్తూ సాగు నీరు అందివ్వనున్నారు. 

రెండు కాల్వలకు నీటి విడుదల చేస్తున్నాం 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఎమ్మార్పీ,ఎస్‌ఎల్‌బీసీ పరిధిలోని హై, లో లెవల్‌ కాల్వలకు ఇప్పటికే నీటి విడుదల చేశాం. వానకాలం సీజన్‌కు హైలెవల్‌ కాల్వకు డిసెంబర్‌ ఆరు వరకు , లో లెవల్‌ కాల్వకు నవంబర్‌ 28 వరకు విడుదల చేస్తాం. వారబందీ పద్ధ్దతిలో ఈ నీటిని విడుదల చేస్తున్నందున రైతులు ఈ నీటిని పొదుపుగా వినియోగించుకొని నీటి వృథా చేయకుండా చూడాలి. 

-సాయిబాబా, ఏఎమ్మార్పీ ఎస్‌ఈ , నల్లగొండ

ఏఎమ్మార్పీ కాల్వలకు నీటి విడుదల షెడ్యూల్‌ ఇలా... 

హైలెవల్‌ కెనాల్‌కు                      డివిజన్ల వారీగా 

డివిజన్‌ 1 అంగడి పేట, 

2 గుర్రంపోడు,  3. నల్లగొండ                              

డివిజన్లు        విడుదల తేదీలు                                               

1, 2, 3        ఆగస్టు 9నుంచి 23

2, 3            ఆగస్టు 24నుంచి 30

1, 2            31నుంచి సెప్టెంబర్‌ 07

2,3             సెప్టెంబర్‌ 8నుంచి 15

1,2             సెప్టెంబర్‌ 16నుంచి 23

 2,3            సెప్టెంబర్‌ 24నుంచి 30

 1, 2          అక్టోబర్‌ 1 నుంచి 7

 2,3           అక్టోబర్‌ 8 నుంచి 14

 1,2           అక్టోబర్‌ 15 నుంచి 22

 2,3           అక్టోబర్‌ 23 నుంచి 29

 1,2           30 నుంచి నవంబర్‌ 6 

 2,3           నవంబర్‌ 7నుంచి 13

 1,2          నవంబర్‌ 14నుంచి 21

2,3            నవంబర్‌ 22నుంచి 28

1,2            29నుంచి డిసెంబర్‌ 6

లో లెవల్‌ కెనాల్‌కు .. 

ఆగస్టు 3నుంచి 12                  ఆన్‌

ఆగస్టు 13 నుంచి 19 వరకు        ఆఫ్‌

ఆగస్టు 20 నుంచి29 వరకు        ఆన్‌

ఆగస్టు 30  నుంచి  సెప్టెంబర్‌ 5   ఆఫ్‌

సెప్టెంబర్‌6 నుంచి 12 వరకు       ఆన్‌

సెప్టెంబర్‌ 13నుంచి 19వరకు      ఆఫ్‌

సెప్టెంబర్‌ 20నుంచి  26వరకు     ఆన్‌

సెప్టెంబర్‌ 27నుంచి అక్టోబర్‌ 3    ఆప్‌

అక్టోబర్‌ 4 నుంచి 10 వరకు       ఆన్‌

అక్టోబర్‌ 10నుంచి 17 వరకు      ఆఫ్‌

అక్టోబర్‌ 18నుంచి 24 వరకు      ఆన్‌

అక్టోబర్‌25నుంచి 31 వరకు       ఆఫ్‌

నవంబర్‌ 1నుంచి 7వరకు          ఆన్‌

నవంబర్‌ 8నుంచి 14వరకు        ఆఫ్‌

నవంబర్‌ 15నుంచి 21వరకు      ఆన్‌

నవంబర్‌ 22నుంచి 28వరకు      ఆఫ్‌  logo