బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 09, 2020 , 03:24:26

నల్లగొండ పట్టణంలో అక్రమ లేఅవుట్ల గుర్తింపు..

నల్లగొండ పట్టణంలో అక్రమ లేఅవుట్ల గుర్తింపు..

  •  సర్వేనెంబర్లు వెల్లడించిన మున్సిపల్‌ అధికారులు

నీలగిరి: నల్లగొండ పట్టణంలో అక్రమ లేఅవుట్లను గుర్తించినట్లు మున్సిపాలిటీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, శిఖంభూములు, అనధికార లేఅవుట్లు, వివాదాస్పద భూములను గుర్తించారు. పట్టణంలో సుమారు 50ఎకరాల్లో 12వెంచర్లు అక్రమంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంధంవారిగూడెం పరిధిలోని 428, 436/ఏ, 485, 486 సర్వేనెంబర్లు, చర్లపల్లిలోని 465, పానగల్‌లో 1154, 1157, హైదర్‌ఖాన్‌గూడలోని 62, 67, 68, 69, 71, 72, 73, 74, 78, 79, మామిళ్లగూడెం పరిధిలోని సాగర్‌రోడ్‌లో 514, 106, 648 మునుగోడు బైపాస్‌ రోడ్‌లో 819, అర్జాలబావిలో 1611, 1612, 1613 సర్వేనెంబర్లలో 3ఎకరాలు, గొల్లగూడెం పరిధిలోని ముషంపల్లి రోడ్‌లో 344, 345, 346 సర్వేనెంబర్ల్‌లో అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వేనెంబర్లలో క్రయవిక్రయాలు జరుపరాదని మున్సిపల్‌ కమిషనర్‌ బచ్చలకూరి శరత్‌చంద్ర తెలిపారు. ఈ సర్వేనెంబర్లలో భూములు రిజిస్ట్రేషన్‌ చేయరాదని జిల్లా రిజిస్ట్రార్‌కు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. 


logo