గురువారం 01 అక్టోబర్ 2020
Nalgonda - Aug 09, 2020 , 03:12:51

ఇన్‌కం ట్యాక్స్‌ అధికారినని టోపీ

ఇన్‌కం ట్యాక్స్‌ అధికారినని టోపీ

  • రెండున్నర తులాల బంగారం చైన్‌, 
  • తులం ఉంగరంతో ఉడాయింపు 

నల్లగొండ క్రైం  ఆదాయ పన్ను అధికారినంటూ ఓ బంగారం దుకాణం యాజమానికి కుచ్చుటోపీ పెట్టాడు. రెండున్నర తులాల బంగారం చైన్‌, తులం ఉంగరం కొనుగోలు చేసినట్లు నటించి ఉడాయించాడు.  తెలిసిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని బీట్‌ మార్కెట్‌ సమీపంలోని  జ్యుయలరీ షాపునకు  నెల 6వ తేదీన 40 సంవత్సరాల వ్యక్తి (టీఎస్‌ 07 జే3366) కారులో వచ్చి  ఇన్‌కం ట్యాక్స్‌ అధికారినని పరిచయం చేసుకున్నాడు. ఒక చైన్‌, ఉంగరం  చేసి  పేమెంట్‌ చేస్తానని షాపు యజమాని లాకుమారపు శ్రీనివాస్‌ సెల్‌ నెంబర్‌ తీసుకున్నాడు.   లక్షా 64వేల 274 రూపాయలు పంపించినట్లు అతని సెల్‌ఫోన్‌లో చూపించాడు. సర్వర్‌ సమస్య ఉందని, మీ మొబైల్‌లో చూపించడం లేదు..  వస్తాయని నమ్మబలికి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ డబ్బులు రాకపోవడంతో ఈ నెల 7న బ్యాంకుకు వెళ్లి విచారణ చేశాడు. అతను మోసం చేసినట్లు తెలుసుకుని శనివారం  పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదగిరి తెలిపారు. 


పట్టణంలో భారీ  

l   20 తులాల బంగారం,  లక్షల నగదు చోరీ 

నల్లగొండ క్రైం : పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగినట్లు నల్లగొండ వన్‌ టౌన్‌ సీఐ నిగిడాల సురేశ్‌ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు  చైతన్యపురి కాలనీకి చెందిన ఇస్లావత్‌ మహేందర్‌నాయక్‌ ఈ నెల 5వ తేదీన  తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాడు. శనివారం ఉదయం ఇంటి తలుపులు తీసి ఉండడంతో ఇంటి పక్కవారు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటికి వచ్చి చూసి  జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  20.25 తులాల బంగారం, రూ.8.50 లక్షల నగదును దోచికెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసి క్లూస్‌ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. logo