బుధవారం 21 అక్టోబర్ 2020
Nalgonda - Aug 06, 2020 , 00:53:52

15లోగా పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలి

15లోగా పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలి

నీలగిరి : గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓ, ఎంపీడీఓ, తాసిల్దార్‌, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు, ప్రకృతి వనాల ఏర్పాటు, ప్లాంటేషన్‌,  పంట నూర్పిడి కల్లాల గ్రౌండింగ్‌ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో గుర్తించిన భూముల్లో ప్రభుత్వం సూచించిన మేరకు చుట్టూ ఫెన్సింగ్‌తో కనీసం మూడు లేదా నాలుగు వేల మొక్కలు నాటి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. మండలాల్లో భూమి గుర్తించిన చోటా  తాసిల్దార్‌, ఎంపీడీఓలు సంయుక్తంగా కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు మొదలు పెట్టాలని సూచించారు. ఎంపీడీఓ, తాసిల్దార్లు సమన్వయంతో పనిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 20 తరువాత రాష్ట్ర స్థాయి ఫ్లైయింగ్‌ స్కాడ్‌ బృందాలు   తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయని చెప్పారు. చనిపోయిన మొక్కల స్థ్ధానంలో కొత్త మొక్కలు నాటే ప్రక్రియపై అడిగి తెలుసుకున్నారు. నూర్పిడి కల్లాల ఏర్పాటుకోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఆగస్ట్టు 8వ తేదీ నాటికి ప్రతి గ్రామ పంచాయతీకి రెండు నిర్మించి పనులు పూర్తి చేయాలన్నారు. డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీఓ, ఈజీఎస్‌టీఓటీ జిల్లా స్థ్ధాయి శిక్షణ రేపటి నుంచి 13లోగా నిర్వహించాలన్నారు. డర్టీ ఫ్రీ ఇండియా శిబిరాలు 8 నుంచి 15 వరకు చేపట్టాలన్నారు. పబ్లిక్‌ భవనాల్లో శ్రమదానం, వైట్‌వాష్‌. పరిశుభ్రత కార్యక్రమాలు 10న నిర్వహించాలన్నారు. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమంలో కాంపౌండ్‌ వాల్స్‌కు పెయింటింగ్‌ 11న పూర్తి చేయాలని, 12న లోపల అన్ని రకాల ప్లాంటేషన్‌ పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏసీ రాహుల్‌శర్మ, జడ్పీ డిప్యూటీ సీఈఓ సీతాకుమారి ఉన్నారు. 


logo