శనివారం 26 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 05, 2020 , 00:56:50

సాగ‌ర్ నీటి విడుద‌ల‌పై ఆచితూచి నిర్ణ‌యం

సాగ‌ర్ నీటి విడుద‌ల‌పై ఆచితూచి నిర్ణ‌యం

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటి విడుదలపై రాష్ట్ర ప్రభ్వుం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తుంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి నిల్వలను, రానున్న కాలంలో వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. పశ్చిమ కనుమల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆశాజనకంగా ఉన్నట్లు కూడా భావిస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కృష్ణానదిలోకి ఎగువ నుంచి వచ్చిన వరదను కూడా ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది.  క్రమంలో మంగళవారం  కేసీఆర్‌ నేతృత్వంలో కృష్ణాజలాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉన్నతాధికారులతోపాటు మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. 

ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు గత 20 రోజులుగా పైనుంచి వరద వచ్చి  దీంతో  క్రమక్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించి.. ఆ నీటిని నాగార్జునసాగర్‌కు తరలించింది. దీంతో సాగర్‌లో  రోజులుగా 24 అడుగుల నీరు పెరిగి నీటిమట్టం 553 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం సాగర్‌లో 216 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈసారి వరద ప్రారంభమయ్యే నాటికి సాగర్‌లో 167 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో 529.10 అడుగుల కనిష్ఠ నీటి మట్టం నమోదైంది.  ఇదే సమయానికి సాగర్‌లో  అడుగుల నీటిమట్టంతో 126.60 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ముందే రంగంలోకి దిగడంతో శ్రీశైలం నుంచి  నీటిని తీసుకురాగలిగింది. అయితే.. శ్రీశైలం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేయడంపై ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు   నీళ్లు వస్తే తెలంగాణతోపాటు ఇరు రాష్ర్టాల ఆయకట్టుకు ప్రయోజనమే కదా.. అని తెలంగాణ ష్ట్రిపభుత్వం చెబుతుంది. అయినా ఏపీ ప్రభుత్వం తన తీరు మార్చుకోకుండా సాగర్‌ రైతుల ష్ట్రిపయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై ఆచితూచి వ్యవహరించాలని భావిస్తుంది. ఒకసారి నీటి విడుదల ప్రారంభిస్తే పంట పూర్తయ్యే వరకు కొనసాగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే.. జిల్లా పరిధిలోని సాగర్‌ ఎడమ కాల్వకు, ఏఎమ్మార్పీ, లో లెవల్‌ కెనాల్‌  ఆయకట్టుకు నీటి విడుదల చేయాలంటే కనీసం 80 టీఎంసీల నీరు అందుబాటులో ఉండాలి. కానీ ఇప్పుడున్న నీరు అందుకు సరిపోయేలా లేదు. పైగా.. ఉన్న నీటిలో ఏపీకి వాటా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తుంది. 

ఇప్పటికైతే కృష్ణా బేసిన్‌లో ఆశాజనకమైన వాతావరణమే కనిపిస్తుండడంతో నీటి విడుదలపై త్వరలో స్పష్టత రానుంది. కృష్ణా రివర్‌ బోర్డు నిర్ణయం కూడా ఇందులో కీలకం  అందుబాటులో ఉన్న నీటిపై కేటాయింపులు కూడా జరుగాల్సి ఉన్నది.  


logo