ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 05, 2020 , 00:19:27

ఈ నెలాఖరుకు పార్టీ కార్యాలయాలు సిద్ధం

ఈ నెలాఖరుకు పార్టీ కార్యాలయాలు సిద్ధం

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ సూర్యాపేట టౌన్‌ : నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా నూతన కార్యాలయ నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డితో కలిసి పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులో నిర్మిస్తున్న పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌లో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఉంటాయని, ప్రారంభానికి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు. కార్యాలయ డిజైన్‌ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో నాణ్యతలో రాజీలేకుండా మంచి డిజైన్‌తో పార్టీ కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బోయినపల్లి కృష్ణారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, పిల్లి రామరాజు, పాశం సంపత్‌రెడ్డి, ఎండీ అనీస్‌, ఎండీ జమాలుద్దీన్‌ పాల్గొన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో నిర్మాణంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ పనులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉమ్మడిజిల్లాను కోట్లాది రూపాయల నిధులతో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేశారని కొనియాడారు. పేటలో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ జిల్లా కార్యాలయం దసరా నాటికి సిద్ధమై అదేరోజు ప్రారంభం చేసుకునేలా అన్నివిధాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


logo