ఆదివారం 09 ఆగస్టు 2020
Nalgonda - Aug 02, 2020 , 01:55:56

పెరుగుతున్నసాగర్‌ నీటిమట్టం

పెరుగుతున్నసాగర్‌ నీటిమట్టం

నందికొండ : శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులకు శనివారం 549అడుగులకు చేరుకొని 207.5790 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 38,140 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.  సాగర్‌ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2200 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం, వరద, కుడి, ఎడమకాల్వల ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం నీటిమట్టం 885అడుగులకు ప్రస్తుతం 852అడుగులు(84.6615 టీఎంసీలు) ఉంది.   26,844 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

మూసీ @633.90అడుగులు  

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శనివారం 633.90(1.99టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ఎగువప్రాంతాల నుంచి 1015 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులుగా ఉంది.  

పులిచింతల @142.39అడుగులు 

చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసీలు) అడుగులకు శనివారం 142.39(10.15 టీఎంసీలు)అడుగులకు చేరింది. ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. 5081 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది.


logo