బుధవారం 05 ఆగస్టు 2020
Nalgonda - Aug 01, 2020 , 01:37:06

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

 నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

నందికొండ : శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టినా శ్రీశైలం జల విద్యుత్‌కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు నిలకడగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులకు శుక్రవారం 547.60అడుగులకు చేరుకొని 204.5220టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 40259క్యూసెక్కల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.  సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1650 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, జలవిద్యుత్‌ కేంద్రం, వరద, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం నీటిమట్టం 885అడుగులకు ప్రస్తుతం 852.50అడుగులు( 85.7503 టీఎంసీలు) ఉంది. 22592 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

మూసీ @633.40అడుగులు  

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం 633.40(1.91టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ఎగువప్రాంతాల నుంచి 2300క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులుగా ఉంది.  

పులిచింతల @143.37అడుగులు 

చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసీలు) అడుగులకు శుక్రవారం 143.37(10.98 టీఎంసీలు)అడుగులకు చేరింది. ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. 4725 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. logo