గురువారం 22 అక్టోబర్ 2020
Nalgonda - Aug 01, 2020 , 01:29:25

సుఖసంతోషాలతో బక్రీద్‌ జరుపుకోవాలి

సుఖసంతోషాలతో బక్రీద్‌ జరుపుకోవాలి

బక్రీద్‌ పండుగను సుఖసంతో షాలతో జరుపుకోవాలని కోరుతూ విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక అయిన ఈ పండుగను ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని కోరారు. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.

- నల్లగొండ కల్చరల్‌


logo