శుక్రవారం 07 ఆగస్టు 2020
Nalgonda - Jul 14, 2020 , 04:25:55

నల్లగొండ మున్సిపల్‌కమిషనర్‌గా శరత్‌చంద్ర

నల్లగొండ మున్సిపల్‌కమిషనర్‌గా శరత్‌చంద్ర

నీలగిరి : నల్లగొండ మున్సిపల్‌ కమిషనర్‌గా  శరత్‌చంద్రను నియమిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న భుక్యా దేవ్‌సింగ్‌ను సంగారెడ్డికి బదిలీ  చేయగా, అక్కడ పనిచేసే శరత్‌ చంద్రను ఇక్కడకు బదిలీ చేసింది. 2018 సంవత్సరంలో నల్లగొండ మున్సిపాలిటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన దేవ్‌సింగ్‌ రెండేళ్ల పాటు సేవలు అందించారు. పట్టణంలోని మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వార్డుల విభజన చేయడంతోపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండావిధులు నిర్వహించారు. కొత్త కమిషనర్‌ రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నట్లు సమాచారం.  


logo