గురువారం 13 ఆగస్టు 2020
Nalgonda - Jul 13, 2020 , 03:27:15

15లోగా రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవాలి

 15లోగా రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవాలి

నల్లగొండ : జూన్‌ 16, 2020 లోపు పట్టాదారు పాసుపుస్తకం వచ్చి బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ ఇవ్వని రైతులు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరోక అవకాశం ఇచ్చినట్లు డీఏఓ శ్రీధర్‌రెడ్డి అదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ బ్యాంకు అకౌంట్‌ వివరాలు సంబంధిత క్లస్టర్‌ ఏఈఓ లేక ఏఓలకు అందజేసి రైతు బంధు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో పాస్‌పుస్తకం వచ్చి బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ ఇవ్వని రైతులు కూడా తమ బ్యాంకు అకౌంట్‌, పాస్‌పుస్తకం మొదటి పేజీ , ఆధార్‌ కార్డు , పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్‌ సంబంధిత ఏఈఓ లేదా ఏఓలకు అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాలో సుమారుగా 26,107 మంది రైతులు ఇంకా బ్యాంకు అకౌంట్‌ ఇవ్వలేదని. వీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


logo