మంగళవారం 27 అక్టోబర్ 2020
Nalgonda - Jul 12, 2020 , 08:39:56

జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం

జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం

  • రోడ్లపై నిలిచిన నీరు.. 
  •   పంట పొలాల్లోకి పారిన వరద

శాలిగౌరారం/ తిరుమలగిరి : అల్పపీడనం ప్రభావంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో పత్తి పంటకు మేలు చేకూరుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఈ వానకాలంలో వర్షాలు అదునుకు పడుతుండటంతో పత్తి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. logo