శుక్రవారం 07 ఆగస్టు 2020
Nalgonda - Jul 11, 2020 , 04:27:25

20లోగా పాఠ్యపుస్తకాల విక్రయానికి దరఖాస్తులు చేసుకోవాలి

20లోగా  పాఠ్యపుస్తకాల విక్రయానికి దరఖాస్తులు చేసుకోవాలి

నల్లగొండ విద్యావిభాగం: జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు విక్రయించుకోవడానికి పుస్తక దుకాణాల యాజమానులు ఈనెల 20లోగా  దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ బి.భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు  ప్రభు త్వ పాఠ్యపుస్తకాలు విక్రయించేందుకు రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ పత్రంతోపాటు రూ.2000 డీడీతో దరఖాస్తులను  డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.


logo