బుధవారం 28 అక్టోబర్ 2020
Nalgonda - Jul 10, 2020 , 04:32:47

మట్టపల్లి లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈఓగా నవీన్‌

మట్టపల్లి  లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈఓగా నవీన్‌

మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీ   లక్ష్మీనృసింహస్వామి ఆలయ గ్రేడ్‌-1 కార్యనిర్వహణాధికారిగా నవీన్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈఓగా పనిచేస్తున్న పి.ఉదయ్‌భాస్కర్‌ ఉద్యోగోన్నతిపై శ్రీజగన్నాథ స్వామి రామ్‌గోపాల్‌ ట్రస్టు సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం కోట మైసమ్మ అమ్మవారి ఆలయ ఈఓగా పనిచేస్తున్న నవీన్‌ బది లీపై ఇక్కడికి వచ్చారు. ఆయనకు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయకుమార్‌ స్వాగతం తెలిపారు.logo