మంగళవారం 11 ఆగస్టు 2020
Nalgonda - Jul 08, 2020 , 00:45:28

హరితగ్రామాలుగా తీర్చిదిద్దాలి

హరితగ్రామాలుగా తీర్చిదిద్దాలి

  • కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి      
  • పలుగ్రామాల్లో నర్సరీలు, వైకుంఠధామాల పరిశీలన 

చిలుకూరు : జిల్లాలోని అన్ని గ్రామాలను హరితగ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని బేతవోలు, కొండాపురం, మాధవగూడెం గ్రామాల్లోని నర్సరీలు, వైకుంఠధామాలు, చెత్త డంపింగ్‌ యార్డులు, తడి, పొడిచెత్త సేకరణ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో విరివిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే గ్రామాల్లోని అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హరితహారంతో రోడ్లను సుందరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

గ్రామాల్లోని వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, చెత్త సేకరణ కేంద్రాలను త్వరితగతిన పూర్తిచేసి వాటి  చుట్టూ మొక్కలు నాటాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామాల్లో పనితీరుపై  ఇతర జిల్లాల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. అనంతరం రోడ్ల వెంట నాటిన మొక్కలను పరిశీలించి వాటి రక్షణ కోసం తీసుకున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బండ్ల ప్రశాంతికోటయ్య, తాసిల్దార్‌ శ్రీనివాసశర్మ, ఎంపీడీఓ ఈదయ్య, సర్పంచులు వట్టికూటి చంద్రకళానాగయ్య, వేనేపల్లి సుగుణమ్మ, మాదాసు లింగయ్య, ఎంపీటీసీలు వట్టికూటి ధనమూర్తి, బుడిగెం సైదమ్మ, ఏపీఎం రమణాకర్‌, గ్రామపంచాయతీ కార్యదర్శులు షరీఫొద్దీన్‌, కార్తీక్‌, కవిత, వేనేపల్లి ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు. logo