సోమవారం 03 ఆగస్టు 2020
Nalgonda - Jul 07, 2020 , 05:54:49

అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న ఏజెన్సీపై కేసు

 అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న ఏజెన్సీపై కేసు

నల్లగొండ క్రైం : నల్లగొండ పరిసర ప్రాంతాల్లో రైతులకు అనుమతి లేకుండా పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఏజెన్సీపై  కేసు నమోదు చేసినట్లు  టూటౌన్‌ ఎస్‌ఐ నర్సింహులు తెలిపారు.  పట్టణంలోని శ్రీనగర్‌కాలనీలో నయాగ్రా సీడ్స్‌, సీతారామ, అదిత్య అగ్రో  కంపెనీలు  ఎలాంటి అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తున్నట్లు  పేర్కొన్నారు. దీంతో  మండల వ్యవసాయ అధికారి సుమన్‌రామన్‌  ఫిర్యాదు మేరకు ఆయా కంపెనీలపై కేసు నమోదు చేసి  విత్తనాలను స్వాధీనం చేసుకుని నాణ్యత కోసం హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.


logo