మంగళవారం 11 ఆగస్టు 2020
Nalgonda - Jul 06, 2020 , 03:48:54

నిబంధనల మేరకు బీఆర్‌ఏఓయూలో అడ్మిషన్లు

నిబంధనల  మేరకు బీఆర్‌ఏఓయూలో అడ్మిషన్లు

  •  ఈనెల 31 వరకు యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు అవకాశం
  • వీడియోకాన్ఫరెన్స్‌లో రిజిస్ట్రార్‌ డా॥ జి.లక్ష్మారెడ్డి

నల్లగొండ విద్యాభాగం:  ప్రభుత్వ నిబంధనలమేరకు ఆన్‌లైన్‌లో 2020-21కి యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభించినట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌  డా.జి. లక్ష్మారెడ్డి తెలిపారు. ‘కొవిడ్‌-19 నిబంధనలు - భౌతిక దూరం -విద్యార్థుల విద్య’ అనే అంశంపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీఆర్‌ఏఓయూ పది అధ్యాయన కేంద్రాల్లో  పనిచేస్తున్న కౌన్సిలర్స్‌(అధ్యాపకులు), కోఆర్డినేటర్స్‌, ప్రిన్సిపాల్స్‌తో ఆదివారం  వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. 

కొవిడ్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వం సూచించిన పద్ధ్దతులతో అధ్యాయన కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు కోర్సుల వివరాలు తెలిపి సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఏఓయూ రీజినల్‌ సెంటర్‌ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ డా॥ బి.ధర్మానాయక్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని పది అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అడ్మిషన్లకు జూలై 31 వరకు చివరి గడువుఉందని తెలిపారు. ఎలాంటి విద్యార్హత లేకుండా నేరుగా డిగ్రీలో చేరే వారికి యూనివర్సిటీ నిర్వహించే అర్హత పరీక్షకు ఈనెల 7లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.   సమావేశంలో కౌన్సిలర్స్‌ డా.లింగనబోయిన లేఖానందస్వామి, డా.కృష్ణారెడ్డి, నందకుమార్‌, ఆర్‌.హరికిషన్‌రావు, వెంకటరమణ, పద్మ, హరిత, జి.నర్సింహతోపాటు బీఆర్‌ఏఓయూ సిబ్బంది  పాల్గొన్నారు.


logo