ఆదివారం 09 ఆగస్టు 2020
Nalgonda - Jul 05, 2020 , 04:56:35

సాగు సంబురం

సాగు సంబురం

  • జూన్‌లో సగటును మించి ‘నైరుతి’ వర్షపాతం 
  • అందుబాటులో సమృద్ధిగా ఎరువులు, విత్తనాలు.. 
  • చేతికందిన ‘రైతుబంధు’ పెట్టుబడి సాయం 
  • ఆశాజనకంగా మొదలైన వానకాలం సాగు పనులు
  • నల్లగొండలో 26శాతం, సూర్యాపేటలో 52శాతం పంటల సాగు పూర్తి 
  • పత్తి, కంది, వరి, మెట్ట పంటల సాగులో రైతులు బిజీ..

ఎవ్వరూ ఊహించని కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచారు. యాసంగిలో వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్‌.. వానకాలంలోనూ అంతకు మించి ‘నియంత్రితసాగు’ ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. ప్రకృతి సైతం కరుణిస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం ఊపందుకుంది. రైతులు ఉత్సాహంగా సాగు పనుల్లో బిజీఅయ్యారు. వరి నారుదశలో ఉండగా ప్రధాన మెట ్టపంటలు పత్తి, కంది సాగు దాదాపు పూర్తికావొచ్చింది. అవసరానికి సరిపడా ముందస్తుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచిన సర్కారు.. విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధు పంటపెట్టుబడి సాయం రైతుల అకౌంట్లలో జమచేసి ఆపన్నహస్తం అందించింది. దీంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వానకాలం సాగు సంబురం మొదలైంది. 

 నల్లగొండ జిల్లాలో(ఎకరాల్లో)

పంట మొత్తం(అంచనా)   ప్రస్తుతం 

వరి     78,859       974 

పత్తి 2,39,865 62,835

కంది        9,540     1,147 


సూర్యాపేట జిల్లాలో(ఎకరాల్లో)

పంట మొత్తం(అంచనా)  ప్రస్తుతం 

వరి                 3,20,000 1,72,000

పత్తి          1,83,000    95,604 

కంది            40,000       8,269


అదనపు వర్షపాతం

నల్లగొండ     25%

సూర్యాపేట     43%


రైతుబంధు..     రైతులు నగదు

నల్లగొండ 40,2155     రూ.556కోట్లు 

సూర్యాపేట     22,7242     రూ.292కోట్లు

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  జూన్‌ మొదటివారం నుంచే వర్షాలు కురుస్తుండడంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రైతులు పూర్తిగా వానకాలం సాగులో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పత్తి, కంది పంటల సాగులో  బిజీబీజీగా మరారు. నల్లగొండ జిల్లాలో మొత్తం ఈ సీజన్‌లో 3,47,616 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు కావచ్చని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. అందులో ఇప్ప టికే 65,288 ఎకరాల్లో సాగు పనులు ప్రారంభమయ్యాయి.  మొత్తంలో వరి 78,859 ఎకరాల్లో సాగవుతుందని అంచనా  వేయగా ఇప్పటి వరకు 974 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మెట్ట ప్రాంతాల్లో మరో పది రో జుల్లో, ఆయకట్టులో జూలై చివరినాటికి వరినాట్లు ఊపందుకోనున్నాయి. నాగార్జునసాగర్‌, ఏఎమ్మార్పీ కాల్వల  పరిధిలోనే  వరి సాగు కావాల్సి ఉంది.  జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పత్తి ముమ్మరంగా సాగువుతోంది. ఈ సీజన్‌లో మొత్తం 2,39,865 ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా ఇప్పటివరకు 62,835 ఎకరాల్లో  విత్తనాలు వేశారు. ఇప్పటికే వర్షాలు కురిసిన మండలాల్లో పత్తి సాగు పూర్తి కావచ్చింది. పెద్దవూరలె  75, తిర్మలగిరిసాగర్‌  90, మర్రిగూడ  75, చిం తపల్లి, శాలిగౌరారం మండలాల్లో  60 శాతం పత్తిసాగు పూర్తయ్యింది. మిగిలినది వారం రోజు ల్లో పూర్తి కావచ్చని భావిస్తున్నారు. కంది  9,540 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటివరకు 1,147 ఎకరాల్లో సాగైంది. గతంలో పోలిస్తే..ఈ సారి కంది సాగుపై రైతులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. వీటితో పాటు జొన్న, పెసర పంటల సాగు కూడా మొదలైంది. జూలై రెండో వారం నాటికి మెట్టపంటల్లో మెజార్టీగా సాగుకు నోచుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

సూర్యాపేట జిల్లాలో 52శాతం  పత్తి సాగు 

 సూర్యాపేట జిల్లాలో  ఈ సారి వరి సాగు భారీగా పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం జలాలతో భూగర్భజలాలు సమృద్ధిగా పెరగడంతో పాటు ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వల ద్వారా కూడా సాగునీరు అందుబాటులో ఉండడంతో కేవలం ఈ సీజన్‌లో వరి   32 వేల ఎకరాల్లో సాగు కావచ్చని అధికారుల అంచనా.  వరి పూర్తిగా నారుమళ్ల దశలో ఉన్నది. పత్తి  సాగు జోరుగా నడుస్తోంది. ఇప్పటికే 52 శాతం పంట సాగు పూర్తైంది. మొత్తం ఈ సీజన్‌లో 1,83,000 ఎకరాల్లో పత్తి పంట సాగు కావచ్చని అం చనా.95,604 ఎకరాల్లో ఇప్పటివరకు పత్తి విత్తనాలు పడ్డాయి.  మరో పది రోజుల్లో మిగిలినది కూడా పూర్తి కావచ్చని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పోలిస్తే కంది సాగు కూడా గణనీయంగా పెరగనుంది. మొత్తం 40వేల ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా. ఇప్పటివరకు 8,269 ఎకరాల్లో సాగైంది. తర్వాత పెసర  కూడా అంచనాలో 40 శాతం పైగా సాగైంది.  మొ త్తం 16వేల ఎకరాల్లో సాగవుతుందన్న అంచనాకు  6,465 ఎకరాల్లో ఇప్పటివరకు సాగైంది. వేరుశనగ   కూడా 2200 ఎకరాలకు  760 ఎకరాల్లో పూర్తైంది. అన్ని పంటలు కలిపి జూన్‌ లో మొత్తం 20 శాతం సాగు పూర్తైనట్లు  అధికారులు వెల్లడించారు. ఇందులో వరి సాగు  పక్కనపెడితే మెట్టపంటలు 46శాతం సాగు పూర్తయినట్లే.. 

ఆశాజనకంగా వర్షపాతం 

  ఈ సీజన్‌లో వాతావరణం కూడా ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకు రెండు జిల్లాలోని ఎక్కువ మండలాల్లో మెట్టపంటల  సాగుకు కావాల్సిన వర్షం కురిసినట్లుగా జిల్లా ప్రణాళిక విభాగం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో జూన్‌లో సగటున 85.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమో దు కావా ల్సి ఉండగా చివరి రోజు 106 మిల్లి మీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 25 శాతం అదనంగా ఉన్నది. ఇక సూర్యాపేట జిల్లాలో వర్షపాతం పరిశీలిస్తే జూన్‌లో సగటున 93.7 మి. మీట ర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 134. 02 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.  దాదాపు 43 శాతం అదనంగా వర్షం కురిసిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.రెండు రోజులుగా ఇరు జిల్లాల్లోని పలు ప్రాంతా ల్లో కురుస్తున్న వర్షాలు ఇప్పటికే వేసిన పంటలకు జీవం పోస్తుండగా మరికొన్నిచోట్ల విత్తనాలు నాటేందుకు అనువుగా ఉన్నాయి. 

95శాతం పైగా రైతుబంధు డబ్బుల జమ 

   వానకాలం సీజన్‌ ప్రారంభంలోనే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఇప్పటికే 95 శాతం పైగా రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు బదిలీ జరిగింది.  నల్లగొండ  జిల్లాలో ఈ నెల 2వ తేదీ నాటికి 4,02, 155 మంది రైతులకు రూ.556 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 2,27,242 మంది రైతులకు రూ.292 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.  వీటికి తోడు ఎరువులు, విత్తనాలను కూడా జూన్‌ నుంచి అందుబాటులో ఉంచారు. ఈ సీజన్‌ లో ఎక్కడా కూడా కొరత అనే సమస్య తలెత్తలేదు. జూలై రెండు, మూడో వారం నాటికి మెట్ట పంటల సాగు చివరి దశకు చేరుకోనుండగా. వరి నాట్లు ముమ్మరం కానున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి సాగుకు సంబం ధించి అన్నిరకాలుగా ప్రోత్సాహం లభిస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. logo