శనివారం 04 జూలై 2020
Nalgonda - Jul 01, 2020 , 03:50:28

సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి

సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి

  కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

అర్వపల్లి : హరిత తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని రామన్నగూడెంలో హరితహారం కార్యక్రమాన్ని పరిశీలించి అనంతరం నర్సరీని సందర్శించారు. గ్రామంలో పర్యటించి వీధుల్లో నాటిన  మొక్కలను పరిశీలించారు. హరితహారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హరితహారంలో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి మొక్కలను నాటించాలని సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించే  బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, సర్పంచ్‌ రమావత్‌ పీరమ్మ, తాసిల్దార్‌ హరిచంద్రప్రసాద్‌, ఎంపీఓ రాజు, ఏపీఓ శైలజ, గిర్దావర్‌ కరుణాకర్‌ తదితరులు ఉన్నారు. 


logo