శనివారం 04 జూలై 2020
Nalgonda - Jul 01, 2020 , 03:32:03

బొప్పాయితో ఆరోగ్యం

బొప్పాయితో ఆరోగ్యం

పోషక విలువలు అధికం

 ఆకులు, పూతతోనూ ప్రయోజనం 

 హరితహారం నర్సరీల్లో విరివిగా లభ్యం 

నేరేడుచర్ల 

బొప్పాయి రుచిలోనే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరూ రోజూ తీనే పండ్లలో బొప్పాయి కూడా ఉండేలా చూసుకోవాలి. ఆపిల్‌, జామ, సీతాఫలం, అరటి ఫలాల కన్నా బొప్పాయిలోనే అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి విటమిన్‌-ఏ పుష్కలంగా చేకూరుతుంది. బొప్పాయిని పపాయ, పాపా అని కూడా పిలుస్తారు. హరితహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మొక్కలతో పాటు బొప్పాయి మొక్కలను పంపిణీ చేస్తున్నందున ప్రజలు ఇళ్లలో నాటుకుంటే చాలా ప్రయోజనాలు పొందుతారు. 

ఉపయోగాలు...

 పతి రోజూ తగు మోతాదులో బొప్పాయి పండును తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. 

  ముక్కలను కోడిగుడ్డు సొనతో కలిపి తీసుకుంటే నోటిపూత, కాలేయ సమస్య, బుద్ధిమాంద్యం, శారీరక అలసట దరిచేరవు. కంటి సమస్యలు తగ్గుతాయి.

  ముక్కలను తేనెలో కలిపి తీసుకుంటే గుండె, కాలేయం, నరాల్లో రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది.

  వ్యాధిగ్రస్తులు రోజు రెండు బొప్పాయి ముక్కలను తింటే మేలు కలుగుతుంది. 

  దరిచేరవు. కడుపులో గడ్డలు, క్యాన్సర్‌ వంటి భయంకర వ్యాధుల నుంచి రక్షిస్తుంది. 

  నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. బొప్పాయి గింజల్లో ఉండే కార్టీసీమీన్‌ కడుపులోని సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. 

  పూతను మెత్తగా చేసి పేను కొరుకుడుకు గురైన ప్రాంతంలో రాస్తే త్వరగా వెంట్రుకలు వస్తాయి. 

  కూడిన పచ్చి బొప్పాయిలో ఉండే పెఫైస్‌ అనే ఎంజైయమ్‌ ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. పచ్చికాయను కూర వండి తినడం వల్లన ప్లీహగ్రంథి సమస్య తగ్గుతుంది. 

  కూరను గర్భిణులు తీసుకోకూడదు. 

గర్భసంచిపై ప్రభావం ఉంటుంది. 

  ఉన్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయి వాడితే మేలు జరుగుతుంది. 

ఆకులతోనూ మేలు... 

బొప్పాయి ఆకుల్లో కార్వీన్‌ అనే పదా ర్థం కీళ్ల నొప్పులకు దివ్వ ఔషధంలా పని చేస్తోంది. బొప్పాయి ఆకులను వేడిచేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టుకట్టాలి. ఆకుల రసంలో యాంటి సెప్టిక్‌ ఉన్నందున రసాన్ని పుక్కిలిస్తే నోటిపూతతో పాటు టాన్జిల్స్‌ తగ్గిపోతాయి. 

100 గ్రాముల బొప్పాయిలోని పోషకాలు... 

 శక్తి-179 కేలరీలు, కార్బోహైడ్రేట్లు-1082 గ్రాములు, షుగర్‌-7.82 గ్రాములు, ఫైబర్‌ 1.7 గ్రాములు, కొవ్వు-0.26 గ్రాములు, ప్రోటీన్లు-0.47 గ్రాములు, క్యాల్షియం-20 మి.గ్రా., మెగ్నీషియం-21 మి.గ్రా, పాస్పరస్‌-10 మి.గ్రా, సోడియం-8మి.గ్రా, పొటాషియం-182 మి.గ్రా, జింకు-0.08 మి.గ్రా, విటమిన్‌ ఏ, బీ,సీ, ఈ, కే ఉంటాయి. logo