మంగళవారం 07 జూలై 2020
Nalgonda - Jun 01, 2020 , 01:59:10

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

  •  మండలి చైర్మన్‌ గుత్తా

నల్లగొండ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలని, ఈ విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్త వహించాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ‘పది గంటలకు-పది నిమిషాలు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పూల కుండీలు, కూరగాయల మొక్కల పాదుల వద్ద ఉన్న ఎండిన ఆకులు, చెత్తను తొలగించారు. మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు తన ఇంటి ఆవరణను శుభ్రం చేసినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. logo