బుధవారం 08 జూలై 2020
Nalgonda - May 25, 2020 , 03:00:56

సాగర్‌ నీటిమట్టం 534.6 అడుగులు

సాగర్‌ నీటిమట్టం 534.6 అడుగులు

నందికొండ : నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు ఆదివారం 534.60 అడుగులు (177.2662 టీఎంసీలు) ఉంది. శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం నుంచి సాగర్‌కు 14840 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ఎడమకాల్వకు 5297 క్కూసెక్కులు, కుడికాల్వకు 7233 క్యూసెక్కులు,  ఎస్‌ఎల్‌బీసీకి 2000 క్యూసెక్కులు, వరద కాల్వకు 310 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రధాన జల విద్యుత్‌కేంద్రం ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 811.90అడుగులు (35.4269 టీఎంసీలు) ఉంది.


logo