మంగళవారం 20 అక్టోబర్ 2020
Nalgonda - May 07, 2020 , 02:53:43

ఆంధ్రా వలస కూలీలను అనుమతించాలి

ఆంధ్రా వలస కూలీలను అనుమతించాలి

  • ఎమ్మెల్యే నోముల 

నందికొండ : సరిహద్దులో ఉన్న ఆంధ్రా ప్రాంత వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏపీ అధికారు లు అనుమతించాలని ఎమ్మెల్యే నోము ల నర్సింహయ్య కోరారు. నందికొండలోని తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్టును బుధవారం ఆయన సందర్శించారు. ఆంధ్రాకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కూలీలకు వైద్యపరీక్షలు నిర్వహించి ఆంధ్రాలోకి అనుమతించాలన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే తనయుడు భగత్‌, వైస్‌ చైర్మన్‌ మంద రఘువీర్‌, సీఐ గౌరీనాయుడు, ఎస్‌ఐ శీనయ్య తదితరులున్నారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

పెద్దవూర : మండలంలోని పర్వేదులలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పరిశీలించారు. అనంతరం సుద్దబావితండాకు చెందిన మహిళలకు దగ్గు, ఆయాసం లక్షణాలు ఉండగా ఎమ్మెల్యే ఆమెను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుంటక వెంకట్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ బషీర్‌, సర్పంచులు దండ మనోహర్‌రెడ్డి, చంద్యా నాయక్‌, ఏంపీటీసీలు పులిమాల కృష్ణా రావు, శ్రీరాములు, మాజీ ఎంపీపీ కురాకుల అంతయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రవినాయక్‌ తదితరులు ఉన్నారు.


logo