సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 20, 2020 , 04:10:25

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ

  • సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
  • ఉమ్మడి జిల్లాలో ప్రతి రైతుకు సహకారం
  • డీసీసీబీ రూ.10 కోట్ల లాభాల్లో ఉంది
  • విలేకరుల సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి
  • బాధ్యతలు స్వీకరణ, అభినందించిన విప్‌, ఎమ్మెల్యేలు

నల్లగొండ, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు అందించి సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీసీసీబీ కార్యాలయంలో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై నమ్మకంతో సీఎం కేసీఆర్‌ డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారని, దానిని నిలబెట్టుకునేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు పంట, తాత్కాలిక, దీర్ఘకాలిక రుణాలు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేస్తున్న నేపథ్యంలో సహకార శాఖలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 93,705 మంది రైతులకు రూ. 335 కోట్లు మాఫీ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.25 వేల లోపు రుణం తీసుకున్న 43 వేల మంది రైతులకు రూ. 35 కోట్లు ఒకేసారి మాఫీ అవుతాయన్నారు. 

 అభినందించిన విప్‌, ఎమ్మెల్యేలు

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా ఎన్నికైన గొంగిడి మహేందర్‌రెడ్డి డీసీసీబీ కార్యాలయంలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆధునీకరించిన చాంబర్‌ను ప్రారంభించి పురోహితులతో పూజలు చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య అభినందించారు. సీఈఓ మదన్‌మోహన్‌తో పాటు బ్యాంక్‌ అధికారులు, టీఆర్‌ఎస్‌ నేతలు బోకేలు అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, కటికం సత్తయ్యగౌడ్‌, చీర పంకజ్‌యాదవ్‌, బొర్ర సుధాకర్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ దయాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. logo