మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Mar 17, 2020 , 03:31:41

వీడిన గ్రహణం

వీడిన గ్రహణం

మిర్యాలగూడ-భీమారం-సూర్యాపేట రహదారి పెండింగ్‌ పనులు వేగం పుంజుకున్నాయి. 2016 సంవత్సరంలో రూ.49.4కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పలుచోట్ల అసంపూర్తిగా నిలిచిపోయింది. మొల్కపట్నం నుంచి శెట్టిపాలెం వరకు 7కి.మీ. మేర తవ్వి వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నెలాఖరుకల్లా పనులు పూర్తిచేస్తామని అధికారులు ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భీమారం, లక్ష్మీదేవిగూడెం గ్రామాల మీదుగా బైపాస్‌ నిర్మాణ ్ర పతిపాదనలకు అనుమతులు మంజూరయ్యాయి.

  • భీమారం-సూర్యాపేట రోడ్డు పెండింగ్‌ పనులకు మోక్షం
  • నాలుగేండ్లుగా ఇబ్బందులు పడిన ప్రయాణికులు
  • శరవేగంగా పనులు.. నెలాఖరుకల్లా విస్తరణ పూర్తి
  • లక్ష్మీదేవిగూడెం, భీమారం గ్రామాల మీదుగా బైపాస్‌ నిర్మాణం

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ: మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వెళ్లాలంటే భీమారం మీదుగా 30కి.మీ. మాత్ర మే. దీంతో రహదారి విస్తరణకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం 2016లో పనులు అప్పగించింది. సూర్యాపేట పట్టణ శివారు నుంచి కేతేపల్లి మండలం భీమారం, వేములపల్లి మండలం ఆమనగల్లు, లక్ష్మీదేవిగూడెం, రావులపెంట, సల్కునూరు క్రాస్‌రోడ్డు, మొల్కపట్నం, పచ్చారుగడ్డ, రావువారిగూడెం, శెట్టిపాలెం మీదుగా అద్దంకి రహదారి వరను పను లు మొదలయ్యాయి. ప్రారంభంలో శరవేగంగా జరిగిన పనులు అనంతరం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా నీరసించాయి. మొల్కపట్నం నుంచి మిర్యాలగూడ వైపు 7కి.మీ.పాత రోడ్డును తవ్వి వదిలేయడంతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

లక్ష్మీదేవిగూడెం, భీమారం గ్రామాల పరిధిలో బైపాస్‌ నిర్మాణం.. 

సూర్యాపేట సమీపంలోని భీమారం, లక్ష్మీదేవిగూడెం గ్రామాల పరిధిలో 2కి.మీ. బైపాస్‌ నిర్మించనున్నారు. పాత రోడ్డు విస్తరణతో గ్రామాల ఉనికి ప్రశ్నార్థకం కానున్న నేపథ్యంలో బైపాస్‌ నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం ఆ రెండు గ్రామాల పరిధిలో భూసేకరణ, నిధుల మంజూరుకు రోడ్డు భవనాల శాఖ ఈఎన్‌సీ అనుమతులు మంజూరు చేశారు. 

ఈ నెలాఖరులో పూర్తి కానున్న పనులు...

నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో రేయింబవళ్లు కొనసాగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. శెట్టిపాలెం పరిధిలోని ఎడమకాల్వ సమీపం వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. ప్ర స్తుతం శెట్టిపాలెం గ్రామపరిధిలో పను లు వేగంగా జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పూర్తయితే మిర్యాలగూడ-సూర్యాపేట మధ్య వాహనాల రాకపోకలు పెరుగనున్నా యి. సూర్యాపేట, జనగాం, వరంగల్‌, హన్మకొండకు దగ్గరి రూట్‌ కావడంతో రద్దీ పెరిగే అవకాశాలున్నాయి.

నెలాఖరులోగా రోడ్డు పనులు పూర్తి...

భీమారం-సూర్యాపేట డబుల్‌రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో వేగంగా చేపడుతున్నాం. ఇంతకాలం ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ నెలాఖరులోపు పూర్తిచేస్తాం. దీంతో మిర్యాలగూడ, సూర్యాపేట మార్కెట్లకు ధాన్యం తరలించేందుకు రైతులకు మార్గం సుగమం అవుతుంది.

-భాస్కర్‌, ఆర్‌అండ్‌బీ డీఈ logo
>>>>>>