శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 12, 2020 , 20:58:10

ఆందోళన వద్దు.. అప్రమత్తతే మందు

ఆందోళన వద్దు.. అప్రమత్తతే మందు

 నీలగిరి :  ప్రస్తుత ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌ కరోనా. ఇది ప్రపంచ అంటు వ్యాధిగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఈ వైరస్‌ అత్యంత ప్రమాదకరం కాదు.. కానీ గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలున్న వారికి, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఈ వైరస్‌ సోకితే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చలి ప్రాంతాల్లో ఈ వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఎండ, వేడి ప్రదేశాల్లో వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువ. కానీ ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాపిస్తుండడంతో ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు పలు చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారిని వైద్య పరీక్షలు చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణపై ప్రజలకు తెలిసేలా విస్త్రత ప్రచారం నిర్వహిస్తోంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం సులువే. 

వ్యాప్తి ఇలా..

శ్వాస, స్పర్శ, మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ.

 అత్యంత రద్దీ కలిగిన ప్రదేశాల్లో తిరగక పోవడం, దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, చేతులతో కరచాలనం చేయడం, వ్యాధి ప్రభావిత వ్యక్తి తాకిన వస్తువుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.


వ్యాధి లక్షణాలు

గుండెదడగా ఉండటం, ఆయాసం, జీర్ణ కోశ సమస్యలు, విరేచనాలు, గొంతు నొప్పి, ఛాతినొప్పి, చలి ఉంటే వ్యాధి లక్షణాలుగా అనుమానించవచ్చు.

జాగ్రత్తలు...

 కరోనా వైరస్‌ కణాలు చాలాపెద్దవి. సుమారు 400 నుంచి 500 మైక్రో సైజ్‌లో ఉంటాయి. అందుకే ఏ మాస్కు వాడినా వైరస్‌ లోనికి చేరే అవకాశం తక్కువ 

 ఈ వైరస్‌ గాలిలో ఉండదు. నేలపైనే ఉంటుంది. కరోనా వైరస్‌ ఏదేని లోహపు ఉపరితలం మీద 12 గంటలు ఉండగలదు. సబ్బుతో చేతులను శుభ్ర పరుచుకుంటే సరిపోతుంది. 

 కరోనా వైరస్‌ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. బట్టలు సబ్బుతో ఉతికినా.. ఎండలో రెండు గంటలు ఆరేసినా వైరస్‌ను అరికట్టవచ్చు. వైరస్‌ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే స్పిరిట్‌ ఆధారిత స్టెరిలైజర్‌ను ఎప్పుడు వెంట ఉంచుకోవడం మంచిది.వైరస్‌ వేడి ప్రదేశాల్లో బతుకలేదు.. 26-27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే చనిపోతుంది. వేడి నీరు తాగడం, ఎండలో నిలబడటం లాంటివి చేయాలి. కొన్నాళ్లు ఐస్‌క్రిమ్‌ లాంటి చల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

 గోరు వెచ్చని నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా టాన్సిల్స్‌ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వార ఊపిరి తిత్తుల్లోకి కరోనా బ్యాక్టిరియాలు చేరకుండా నివారించవచ్చు.  కొన్ని రోజుల పాటు జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. 


చేయాల్సినవి...

 వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుగుతూ ఉండాలి.

 సాధారణ పరిశుభ్రత పద్ధతుల్ని పాటిస్తూ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి గుడ్డను అడ్డంగా పెట్టుకోవాలి

 చేతులు అపరిశుభ్రంగా ఉంటే సబ్బుతో బాగా కడుక్కోవాలి. ఆల్కహాల్‌ బేస్‌ ఉన్న శానిటైజర్‌, సబ్బు లాంటి వాటితో శుభ్రం చేసుకోవాలి.

 ఉపయోగించిన టిష్యూలను వెంటనే మూసి ఉండే చెత్త డబ్బాలో వేయాలి. మీకు ఏ మాత్రం అనారోగ్యం అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


చేయకూడనివి...

 దగ్గు, జ్వరం లాంటివి ఉన్న వారితో ఎక్కువ సేపు కలిసి ఉండటం లాంటివి చేయవద్దు.

 బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం చేయకూడదు

 జంతువులకు బాగా దగ్గర ఉండకూడదు. పచ్చిగా లేదా సరిగా ఉడకని మాంసాహారాన్ని తీసుకోకూడదు.

 జంతువులను లేదా జంతువుల మాంసాన్ని విక్రయించే ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. 


జిల్లాలో విస్తృతంగా ప్రచారం...

కరోనా వైరస్‌ ఇతర దేశాల్లో వచ్చిన నాటి నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ విస్తృతమై ప్రచారం చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయడంతో పాటు గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. కరోనా వైరస్‌పై గోడ పత్రాలను ముద్రించి పీహెచ్‌సీల వారీగా పంపిణీ చేసింది. 

హైదరాబాద్‌కు తరలి వెళ్లిన వైద్య బృందం

జిల్లాలో కరోనా వ్యాధి గ్రస్తులు ఉంటే వారికి వైద్యం అందించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలుసుకునేందుకు జిల్లాలోని వైద్య బృందం హైదారాబాద్‌కు వెళ్లింది. హైదరాబాద్‌లో కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించడంతో మంగళవారం అయిదుగురు డాక్టర్లు, పదిమంది స్టాఫ్‌ నర్సులు, హెల్త్‌ అసిస్టెంట్లు వెళ్లారు. వారు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించే విధుల్లో పాల్గొంటున్నారు. గురువారం మరో 10 మంది డాక్టర్లు, పది మంది స్టాఫ్‌ నర్సులు, 10 మంది ల్యాబ్‌ అసిస్టెంట్లు కూడా శిక్షణకు వెళ్లనున్నారు. వీరు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో శిక్షణ పొంది జిల్లాకు వచ్చి సేవలు అందించనున్నారు.



logo