గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 07, 2020 , 00:53:36

భద్రత పథకంతో పోలీసు కుటుంబాలకు భరోసా

భద్రత పథకంతో పోలీసు కుటుంబాలకు భరోసా

నల్లగొండ, నమస్తే తెలంగాణ: పోలీస్‌శాఖలో అమలు చేస్తున్న భద్రత పథకం పోలీసు కుటుంబాలకు భరోసానిస్తుందని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ అన్నారు. ఆయన శుక్రవారం స్థానిక పోలీస్‌ కార్యాలయంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తు మృతిచెందిన మల్లయ్య కుటుంబానికి రూ.8 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకోవడానికి, చనిపోయిన పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు ఈ భద్రతా పథకం చేయూతనిస్తు ఆర్థికంగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ పథకం ద్వారా అందజేసే డబ్బులు వారిలో మనోధైర్యం కల్పించడంతోపాటు ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఉపయోగపడుతున్నాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వచ్చే అన్నిరకాల లబ్ధిని సైతం త్వరలో అందేలా పోలీస్‌ సంక్షేమ సంఘం ప్రతినిధులు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ దయాకర్‌, పోలీస్‌ అదికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామచంద్రగౌడ్‌, నాయకులు సోమయ్య, మల్లయ్య పాల్గొన్నారు.


logo
>>>>>>