మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Mar 07, 2020 , 00:50:50

స్త్రీనిధి లక్ష్యం పూర్తి చేయాలి

స్త్రీనిధి లక్ష్యం పూర్తి చేయాలి

నల్లగొండ,నమస్తేతెలంగాణ: గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ స్త్రీ నిధి లక్ష్యాలను పూర్తిచేయాలని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి  సూచించారు. శుక్రవారం స్థానిక డ్వామా కార్యాలయంలో స్త్రీ రుణాలకు సంబంధించి పట్టణ, గ్రామీణ శాఖల సిబ్బందితో మండలాలు, మున్సిపాలిటీల వారీగా రుణప్రణాళికపై ఆయన  సమీక్షించారు. లక్ష్యాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్త్రీ నిధి కార్యక్రమాల అమలు సక్రమంగా జరుగాలని, 31 మండలాలకు గాను 12 మండలాల్లో 100 శా తం రుణ ప్రణాళిక సాధించినట్లు తెలిపారు. ఈనెల 20 లోగా నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని, అదే విధంగా రికవరీలో వేగం పెంచాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 5.5 శాతం బకాయిలు ఉన్నాయని, ఈ నెల 31లోగా 0.5 శాతం కన్నా తక్కువగా ఉండేలా పని చేయాలని ఆదేశించారు. డీఆర్‌డీఏ పరిధిలో 82.7శాతం రుణప్రణాళిక అమలులో ఉండగా మెప్మా పరిధిలో 62.11 శాతమే ఉందని ఈ ప్రణాళికను పెంచి రాష్ట్రంలో నల్లగొండను ముందు వరుసలో ఉంచాలన్నారు. జిల్లాలోరూ. 138.39 కోట్ల స్త్రీ నిధి రుణాలు మంజూరు చేసి 80.06 శాతం సాధించి ప్రథమ స్థానంలో ఉన్నామని, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 100శాతం పూర్తి చేయాలన్నారు. అదే విధంగా రికవరీ శాతం 98 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెప్మా పీడీ వెంకన్న మాట్లాడుతూ  పట్టణ సమాఖ్యలో స్త్రీ నిధి వాటాధనం చెల్లించకపోవడంతో సభ్యులకు స్త్రీ నిధి రుణాలు అందడం లేద ని, నల్లగొండలో గృహ, స్నేహ, పట్టణ సమాఖ్యలు తక్షణమే వాటాధనం చెల్లించి స్త్రీ నిధి రుణాలు పొందేలా చ ర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీజీఎం సూర్యనారాయణ, ఆర్‌ఎం దుర్గాప్రసాద్‌, స్త్రీనిధి మేనేజర్లు, ఏపీఎంలు పాల్గొన్నారు.  


logo
>>>>>>