శనివారం 28 మార్చి 2020
Nalgonda - Mar 06, 2020 , 01:55:59

వడగండ్ల వాన

వడగండ్ల వాన

నల్లగొండ, నకిరేకల్‌, చండూరు నమస్తే తెలంగాణ/ కట్టంగూర్‌/ కేతేపల్లి/ నార్కట్‌పల్లి : నాగార్జునసాగర్‌/ మిర్యాలగూడ టౌన్‌/కనగల్‌ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత కనిపించినా సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మేఘావృతమై వర్షం పడింది. జిల్లా కేంద్రంలో సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు భారీ వర్షం కురిసింది. శివాజీనగర్‌, హైదరాబాద్‌ రోడ్డులోని పలుకాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. పానగల్‌ బైపాస్‌ సమీపంలో వరద నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో మోస్తరు వర్షం కురవగా చండూరులో భారీగా కురిసింది. నకిరేకల్‌ నియోజకవర్గంలో నకిరేకల్‌, కట్టంగూర్‌, నార్కట్‌పల్లి మండలాల్లో  ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసింది. కట్టంగూర్‌ గాంధీనగర్‌లో వారణాసి మారయ్యకు చెందిన గుడిసె ఈదురుగాలుల దాటికి నేలకూలింది. కల్మెర రోడ్డులో తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లే దారిలో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఏపీజీవీ బ్యాంకు ఎదుట వర్షపునీరు నిలువడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మామి డి, నిమ్మతోటల్లో పిందెలు, కాయలు రాలి నష్టం వాటిల్లింది. కనగల్‌ మండలం జి.యడవల్లి-చండూరు ప్రధాన రహదారిపై నీరు నిలిచి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పత్తి చేలలో పత్తి తడిసింది. logo