మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 06, 2020 , 01:50:30

పరీక్షల సందడి

పరీక్షల సందడి

నల్లగొండవిద్యావిభాగం:ఇంటర్మీడియేట్‌ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం జిల్లా వ్యా ప్తంగా 46 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరం ద్వితీయ లాంగ్వేజ్‌ (తెలుగు, ఉర్దూ, అరబిక్‌, సంస్‌క్రిట్‌, హిందీ) పరీక్షలను జిల్లాలో 14,893 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 14,247 మం ది విద్యార్థులు హాజరుకాగా 646  విద్యార్థులు గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేం ద్రాల వద్ద కరోనాను దృష్టిలో ఉంచుకుని పలువురు విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షకు హాజరయ్యా రు. పరీక్ష కేంద్రాల్లో ైప్లెయింగ్‌, సిట్టింగ్‌ స్కాడ్‌ బృం దాలు తనిఖీలు చేశారు. అదే విధంగా డీఐఈఓ  భానునాయక్‌ జిల్లాలోని నార్కట్‌పల్లితో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి పరీక్ష కేంద్రాలను పరిశీలించగా డీఈసీ, హైపర్‌ కమిటీ బృందాలు జిల్లా వ్యా ప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 


logo