ఆదివారం 29 మార్చి 2020
Nalgonda - Mar 05, 2020 , 01:08:36

నాగార్జునసాగర్‌ నీటి మట్టం 554.30 అడుగులు

నాగార్జునసాగర్‌ నీటి మట్టం 554.30 అడుగులు

నందికొండ : నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను బుధవారానికి 554.30 అడుగుల వద్ద 219.3516 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రాల నుంచి నాగార్జునసాగర్‌కు 75,736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. సాగర్‌ డ్యాం నుంచి కుడి కాల్వ ద్వారా 952 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 9,719 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2200 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 310 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. సాగర్‌ డ్యాం నుంచి మొత్తం 13,181 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండగా, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 845.00 అడుగుల వద్ద 70.0510 టీఎంసీల నీరు నిల్వ ఉంది.  


logo