సోమవారం 30 మార్చి 2020
Nalgonda - Mar 05, 2020 , 01:04:38

ఇంటర్‌ పరీక్షలు షురూ...

ఇంటర్‌ పరీక్షలు షురూ...

నల్లగొండ విద్యావిభాగం : ఇంటర్మీడియట్‌ పరీక్షలు జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన ప్రథమ సంవత్సరం  ద్వితీయ లాంగ్వేజీ పేపర్‌-1 (తెలుగు, ఉర్దూ, అరబిక్‌, సంస్క్రతం అండ్‌  హిందీ) పరీక్షలకు 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 16,635  మంది హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ముందస్తుగానే అధికారులు తెలియజేయడంతో పరీక్షల సమయం సమీపిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు లోపలికి పరుగులు తీశారు. నల్లగొండలో పరీక్ష కేంద్రాలను డీఐఈఓ భానునాయక్‌తోపాటు స్కాడ్‌ బృందాలు తనిఖీ చేశారు.


826 మంది గైర్హాజర్‌...

జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియేట్‌ పరీక్షలకు రెగ్యులర్‌, ఓకేషన్‌ విభాగంలో 17,461 విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 16,635 ( రెగ్యులర్‌ విభాగంలో 14,076, ఓకేషనల్‌ విభాగంలో 2,554)మంది విద్యార్థులు హాజరుకాగా 826 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.  అన్ని పరీక్ష కేంద్రాల్లో  ప్రత్యేక సిట్టింగ్‌ స్క్యాడ్‌లను పంపి పరీక్షలు ముగిసిన తర్వత ప్యాకింగ్‌ చేసే వరకు అక్కడే ఉన్నారు. ఇంటర్‌ విద్య జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూలోని పలు పరీక్ష కేంద్రాలను  పర్యవేక్షించారు.


పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి డీఐఈఓ....

నల్లగొండలోని లిటిల్‌ప్లవర్‌తోపాటు పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ భానునాయక్‌తోపాటు ప్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్యాడ్‌ బృందాలు తనిఖీలు చేశారు.  పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తాగునీటి వసతి, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలు జరిగిన చీప్‌సూపరిండెంట్‌ బాధ్యత వహించాల్సి వస్తుందని సూచించారు.logo