గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 03, 2020 , 01:30:34

తాటికోల్‌ గ్రామసభలో రసాభాస

తాటికోల్‌ గ్రామసభలో రసాభాస

దేవరకొండ, నమస్తేతెలంగాణ : దేవరకొండ మండలంలోని తాటికోల్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రామసభ రసాభసగా సాగింది. వార్డు సభ్యులు తీర్మాణాలు చేయకున్నప్పటికీ మినిట్స్‌ పుస్తకంలో నమోదు చేసి నిధులు డ్రా చేయడంపై వార్డుసభ్యులు సర్పంచ్‌ను నిలదీయడంతో కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. సోమవారం సర్పంచ్‌ జూలూరి ధనలక్ష్మీ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశానికి 12మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. అయితే ఎటువంటి తీర్మాణాలు చేయనప్పటికి సర్పంచ్‌ ఏకపక్షంగా వ్యవహరించి మినిట్స్‌ బుక్కులో నమోదు చేసి 14వ ఆర్థికసంఘం నిధులు, జనరల్‌ ఫండ్‌, ఎస్‌ఎఫ్‌సీ నిధులను డ్రా చేశారని మెజార్టీ వార్డు సభ్యులు సర్పంచ్‌ను నిలదీశారు. 2019 ఏప్రిల్‌ 24వరకు ఎటువంటి తీర్మాణాలు చేయనప్పటికి ఏకంగా 69పనులకు సంబంధించి మినిట్స్‌ బుక్‌లో నమోదు చేయడం జరిగిందని, ఉపసర్పంచ్‌ సామల రవిగౌడ్‌ ఆరోపించారు. గాంధీ జయంతి రోజున కూడా తీర్మాణాలు చేసినట్లుగా మినిట్స్‌లో నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు. డంపింగ్‌యార్డు, ఎల్‌ఈడీ లైట్లకు సంబంధించి కూడా తీర్మాణాలు చేయకుండా మినిట్స్‌లో నమోదు చేయడంపై సర్పంచ్‌ను వార్డుసభ్యులు ప్రశ్నించారు. వార్డుసభ్యులకు తెలియకుండా చేసిన తీర్మాణాలు రద్దు చేసి సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా వారు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దేవరకొండ ఎంపీడీఓ జె.పాండుకు ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగంపై గ్రామసభలో ప్రశ్నించినందుకు సర్పంచ్‌ వర్గీయులు తమపై దాడిచేశారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మంగళవారం కలెక్టర్‌, డీపీఓకు నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేయనున్నట్లు ఉప సర్పంచ్‌ సామల రవిగౌడ్‌ తెలిపారు.


logo
>>>>>>