శనివారం 28 మార్చి 2020
Nalgonda - Mar 01, 2020 , 01:52:10

‘సహకార’ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ

‘సహకార’ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ

నీలగిరి : సీఎం కేసీఆర్‌ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా ఎన్నికైన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపి శాసనసభ్యులతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రికార్డు విజయాలు సాధిస్తూ సహకార ఎన్నికల్లోనూ ఆ ఒరవడిని కొనసాగించిందని పేర్కొన్నారు. దేశంలో ఏ పార్టీ సాధించలేని ఏకపక్ష విజయాలు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ సాధించిందని ఉద్ఘాటించారు. జిల్లాలో 32 జడ్పీ స్థ్ధానాలు, 95 శాతం మున్సిపాలిటీలు, స్థ్ధానిక సంస్థ్ధలు, సహకార ఎన్నికల్లోనూ 95-98స్థానాల్లో విజయం సాధించిన ఘనత దేశంలో మారే ఇతర పార్టీకి సాధ్యం కాలేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మరో 3 దశాబ్దాలపాటు తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా వర్ధిలిల్లుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనాధక్షతపై ప్రజలు మారోమారు విశ్వాసాసం చూపారని పేర్కొన్నారు. జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్‌లు నష్టాల్లో ఉన్నాయని వాటికి పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిపారు. 


సహకార సంఘాల పరిపుష్టితో టీఆర్‌ఎస్‌ రైతాంగాన్ని మరింత చెరువ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని అన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధుల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు, ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్మేలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్‌లే ఏకగ్రీవం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 1987 నుంచి సహకారం సంఘంలో అనుభవం ఉన్న వ్యక్తిని చైర్మన్‌గా చేయడం జరగిందన్నారు. అయనకు సహకార రంగంపై అపారమైన అనుభవం ఉందన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకులు స్వీట్లు పంచుకుని సంబురాలు నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ గొంగడి సునీత, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, రమావత్‌ రవీంద్రకుమార్‌, గాదరి కిశోర్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


జాగృతిని బలోపేతం చేయాలి తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్‌ 

నల్లగొండ రూరల్‌ : తెలంగాణ సంస్కృతిని దేశానికి చాటిన తెలంగాణ జాగృతిని గ్రామగ్రామాన బలోపేతం చేయాలని జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్‌ కోరారు. శనివారం జాగృతి అసెంబ్లీ కన్వీనర్‌ వెంకటాచారి అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అసెంబ్లీ కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు.  సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నల్లగొండ టౌన్‌ జాగృతి కన్వీనర్‌గా నాగెల్లి మధు, మండల కన్వీనర్‌గా భీరం మోహన్‌రెడ్డి ,కనగల్‌ కన్వీనర్‌గా మహేశ్‌, మాడ్గులపల్లి కన్వీనర్‌గా మాధవరెడ్డిలతోపాటు వివిధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వరలక్ష్మి ,శ్రీనివాసచారి, నివాస్‌, వెంకట్‌, మమత, ఉమారెడ్డి, హరి, నరేశ్‌, శివ, పద్మ, వసుంధర, ప్రసాద్‌, రవి తదితరులు పాల్గొన్నారు.


logo