గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 28, 2020 , 02:28:14

పేదింటి ఆడబిడ్డల కోసమే ‘కల్యాణలక్ష్మి’

పేదింటి ఆడబిడ్డల కోసమే ‘కల్యాణలక్ష్మి’

దేవరకొండ, నమస్తే తెలంగాణ : పేదింటి ఆడబిడ్డలకు భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను అమలు చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం దేవరకొండ, చందంపేట మండలాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు రూ.32.50లక్షల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సంక్షేమం కోసం ఇప్పటికే కేసీఆర్‌ కిట్లు, ఆరోగ్య లక్ష్మీ, షీ టీమ్‌ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, వైస్‌ చైర్మన్‌ రహత్‌ అలీ, దేవరకొండ, చందంపేట ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్‌, నున్సావత్‌ పార్వతి, చందంపేట జడ్పీటీసీ రమావత్‌ పవిత్ర, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ శిరందాసు కృష్ణయ్య, దేవరకొండ వైస్‌ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌, తాసిల్దార్‌ వెంకటేశ్వర్లు, డిఫ్యూటీ తాసిల్దార్‌ అర్షద్‌ తదితరులు పాల్గొన్నారు.logo