గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 27, 2020 , 01:18:56

కొనసాగుతున్న ‘పట్టణ ప్రగతి’

కొనసాగుతున్న ‘పట్టణ ప్రగతి’

నల్లగొండరూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి నల్లగొండ పట్టణంలోని 48 వార్డుల్లో ముమ్మరంగా కొనసాగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఆయావార్డుల స్పెషల్‌ ఆఫీసర్లు, వార్డులలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ సభ్యులు విస్త్రతంగా పర్యటించి ఆయాప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తిస్తున్నారు. పట్టణవ్యాప్తంగా 35జేసీబీలు, 40డోజర్లు, 200ట్రాక్టర్లతోపాటు ప్రత్యేక సిబ్బంది పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. 7వ వార్డులో కౌన్సిలర్‌ మారగోని భవానిగణేష్‌ సాయినగర్‌లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజిని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచించారు. 8వ వార్డులో కౌన్సిలర్‌ పిల్లి రామరాజు పర్యటించి సమస్యలను గుర్తించి అంచనాలు సిద్ధంచేశారు. కార్యక్రమాల్లో ఆయావార్డుల ప్రత్యేక ఆఫీసర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. logo