సోమవారం 30 మార్చి 2020
Nalgonda - Feb 25, 2020 , 02:19:26

ప్రగతి మొదలు

ప్రగతి మొదలు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ :   సోమవారం జిల్లా వ్యాప్తంగా పది రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. తొలి రోజు అన్ని పట్టణాల్లోని పలు వార్డులు, అనేక వీధుల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలతో కలిసి పర్యటించారు. నల్లగొండ పట్టణంలోని పానగల్లుతోపాటు 18, 19 వార్డుల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి పర్యటించారు. పారిశుధ్య సమస్యతోపాటు వైకుంఠధామాలను సైతం పరిశీలించారు. దేవరకొండలోని పలు వీధుల్లోనూ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఎమ్మెల్యే రవీందర్‌ కుమార్‌తో కలిసి పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు ఆరా తీశారు. పరిష్కారం కోసం ము న్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నందికొండ, హాలియాలో ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పాల్గొన్నారు. పారిశుధ్యం, విద్యుత్‌ సమస్యల గురించి రెండు పట్టణాల్లో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. వీధులు శుభ్రం చేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చండూరు, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో స్థానిక నేతలు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. కౌన్సిలర్లు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ తమ వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. logo