శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 25, 2020 , 02:14:56

కనులపండువగా రథోత్సవం

కనులపండువగా రథోత్సవం

దేవరకొండ, నమస్తేతెలంగాణ : కమలాపూర్‌ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవంలో కీలక ఘట్టమైన రథోత్సవం సోమవారం తెల్లవారు జామున దేదీప్యమానంగా జరిగింది. రంగురంగుల పూలతో అలంకరించిన రథంపై తిరువీధుల్లో స్వామి అమ్మవార్లు ఊరేగగా.. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌, మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌లు రథోత్సవంలో పాల్గొన్నారు.దేవరకొండ మండలం ముదిగొండ గ్రామపంచాయతీ పరిధిలోని కమలాపురం గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈనెల 21 నుంచి 28 వరకు ఎనిమిది రోజుల పాటు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవంలో ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌, మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌లు పాల్గొని పూజలు చేశారు. 


అనంతరం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ రథాన్ని లాగి రథోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో ఎంపీపీ నల్లగాసు జాన్‌ యాదవ్‌, వైస్‌ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌, జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేశ్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వడ్త్యా దేవేందర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు టీవీఎన్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ శిరందాసు కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు హన్మంతు వెంకటేశ్‌గౌడ్‌, నాయిని సుధీర్‌రెడ్డి, మాధవరం జనార్దన్‌రావు, చీదెళ్ల గోపి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా రథోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవరకొండ డీఎస్పీ ఆనందరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ సీఐ ఆదిరెడ్డి, డివిజన్‌ పరిధిలోని ఎస్‌ఐలు బందోబస్తులో పాల్గొన్నారు.


logo