గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 24, 2020 , 02:23:39

భక్త జన సంద్రం... చెర్వుగట్టు క్షేత్రం

భక్త జన సంద్రం... చెర్వుగట్టు క్షేత్రం

నార్కట్‌పల్లి : మండల పరిధిలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం అమావాస్య కావడంతో ఇతరజిల్లాల నుంచి సైతం భక్తుల తాకిడితో పార్వతీ సమేతుడి క్షేత్రం పోటెత్తింది. గుట్టపై నిద్ర చేసే భక్తులు ఓం శివా, నమః శివా అంటూ శివ సత్తుల పూనకాలతో స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.  భక్తులు అధిక సంఖ్యలో నిద్ర చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారికి నైవేధ్యంతో వండిన బోణాన్ని డప్పు చప్పుళ్లతో తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. 


ఘనంగా లక్ష పుష్పార్చన...

అమావాస్య సందర్భంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపం వద్ద లక్ష పుష్పార్చనలు ఆలయ ప్రధానర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చకుల సహాయంతో వేదమంత్రాల మద్య ఘనంగా నిర్వహించారు. స్వామివారి లక్ష పుష్పార్చనను చూసి భక్తులు పుణీతులయ్యారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించుకుంటూ కోనేరు వద్దకు తీసుకెళ్ళి స్వామివారికి పంచ హారతిని సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌ రెడ్డి, ఈఓ సులోచన, సూపరిండెంట్‌ తిరుపతి రెడ్డిలు అన్ని వసతులను కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలకమండలి సభ్యులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>