మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Feb 22, 2020 , 04:40:00

పరమేశ్వరా పాహిమాం..

 పరమేశ్వరా పాహిమాం..

పరమేశ్వరా పాహిమాం.. ఓ నమఃశివాయ స్మరణతో ఆలయాలు మార్మోగగా.. భక్తులు పరమశివుడి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే బారులు దీరారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

  • భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు
  • భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
  • ప్రత్యేక పూజలు, అభిషేకాలు
  • నేత్రపర్వంగా స్వామివారి కల్యాణం

పరమేశ్వరా పాహిమాం.. ఓ నమఃశివాయ స్మరణతో ఆలయాలు మార్మోగగా.. భక్తులు పరమశివుడి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే బారులు దీరారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చెర్వుగట్టు, పానగల్లు, వాడపల్లిలోని చారిత్రక ఆలయాలతో పాటు నాగార్జునసాగర్‌ సమీపంలో కృష్ణానది మధ్యలో ఉన్న ఏలేశ్వరం గట్టుకు భక్తులు పోటెత్తారు. పూలు, పండ్లు, పంచామృతాలతో శివలింగాలకు అభిషేకం జరిపించారు. రాత్రి పార్వతీ పరమేశ్వరుల  కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


ఓం నమఃశివాయ పంచాక్షరీ స్మరణతో శుక్రవారం శివాలయాలు మార్మోగాయి. మహా శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పరమ శివుడికి ప్రత్యేక పూజలు చేసి శరణు కోరారు.  శివ లింగానికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. కృష్ణా నది తీరాన.. ఏలేశ్వరం గుట్ట పొడవునా భక్తులు బారులుదీరగా.. పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయం కిటకిటలాడింది.  వాడపల్లి మీనాక్షీ అగస్తేశ్వరుడి చెంత మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తగా.. చెర్వుగట్టు జన సంద్రమైంది.  ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి రాగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 


logo
>>>>>>