శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 19, 2020 , 01:58:25

స్వామివారికి ఘనంగా నిత్యపూజలు

స్వామివారికి ఘనంగా నిత్యపూజలు

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. ఈ క్షేత్రానికి పాలకుడిగా చెంతగల గుడిలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తమలపాకులతో అర్చన చేశారు. లలితాపారాయణము చేశారు. ఆంజనేయస్వామివారికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వహించారు. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో శ్రీలక్ష్మీనరసింహుల నిత్యకల్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు శ్రీస్వామి అమ్మవారుల ఆశీస్సులు అందజేశారు. 

స్వామివారికి ట్రాక్టర్‌ బహూకరణ..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి నిజామాబాద్‌కు చెందిన భక్తుడు మహేంద్ర ట్రాక్టర్‌ను బహూకరించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన మహేంద్ర డీలర్స్‌ చైర్మన్‌ సుభాష్‌, పద్మ దంపతులు రూ.5.50 లక్షల విలువైన ట్రాక్టర్‌ను మంగళవారం యాదాద్రికొండపై ఈఓ గీతకు అందజేశారు. 

స్వామిని దర్శించుకున్న  ఒరిస్సా అడిషనల్‌ డీజీపీ..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని ఒరిస్సా అడిషినల్‌ డీజీపీ శ్రీనివాస్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఖజానాకు రూ.6,97,150 ఆదాయం

శ్రీవారి ఖజానాకు రూ.6,97,150 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.1,25,776, రూ. 100 దర్శనంతో రూ. 22,000, కల్యాణకట్ట ద్వారా రూ.18,000, వత్ర పూజల ద్వారా రూ.47,500, ప్రసాద విక్రయాలతో రూ.2,81,865, శాశ్వతపూజల ద్వారా రూ. 14,000, టోల్‌గేట్‌ ద్వారా రూ.1,670, అన్నప్రసాదంతో రూ. 1,116, వాహనపూజల ద్వారా రూ.13,100, ఇతర విభాగాలతో రూ.1,72,123తో కలిపి ఖజానాకు రూ. 6,97,150 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.


logo