శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 18, 2020 , 01:43:17

ప్రజావాణి ఫిర్యాదులు నిర్లక్ష్యం చేయొద్దు

ప్రజావాణి ఫిర్యాదులు  నిర్లక్ష్యం చేయొద్దు
  • కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్లగొండ, నమస్తే తెలంగాణ : జిల్లావ్యాప్తంగా బాధితులు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదులు చేసిన బాధితుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లావ్యాప్తంగా వచ్చిన 148 ఫిర్యాదులను ఆయన ఉదయం, మధ్యాహ్నం సమయంలో స్వీకరించి పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు వాటిని అందజేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, వనమాల చంద్రశేఖర్‌, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్‌ఓ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo