ఆదివారం 29 మార్చి 2020
Nalgonda - Feb 18, 2020 , 01:37:14

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

నకిరేకల్‌,నమస్తేతెలంగాణ : సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను నకిరేకల్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మెయిన్‌సెంటర్‌లో నిర్వహించిన వేడుకలకు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్‌రావు, జడ్పీటీసీ మాద ధనలక్ష్మినగేశ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ గోర్ల సరిత వీరయ్యయాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, నాయకులు ప్రగడపు నవీన్‌రావు, సకినాల రవి, నడికుడి వెంకటేశ్వర్లు, అబ్బగోని శ్రీనివాస్‌, ఏకుల విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


నార్కట్‌పల్లి : పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్బంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీచేశారు. అనంతరం జడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ యానాల అశోక్‌రెడ్డి, ఎంపీడీఓ సాంబశివరావు, తాసిల్దార్‌ రాధ, టీఆర్‌ఎస్‌పార్టీ  మండల అధ్యక్షుడు సట్టు సత్తయ్య, దూదిమెట్ల 


logo