సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 15, 2020 , 01:26:10

వీరజవాన్ల త్యాగం మరువలేనిది

వీరజవాన్ల త్యాగం మరువలేనిది

హాలియా, నమస్తే తెలంగాణ:  పుల్వామాలో ఉగ్రవాద దాడిలో వీరజవాన్ల ప్రాణత్యాగం మరువలేనిదని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. శుక్రవారం హాలియాలో పుల్వామా దాడిలో మృతిచెందిన జవాన్లకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నోముల నర్సింహయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌, మాజీ సైనికుడు నల్లగొండ సుధాకర్‌, కౌన్సిలర్లు వర్ర వెంకట్‌రెడ్డి, ప్రసాద్‌నాయక్‌, నాయకులు వెంపటి శంకరయ్య, చెన్ను వెంకట్‌నారాయణరెడ్డి, అన్వర్‌, నసీరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

పాఠశాలల ఆధ్వర్యంలో... ఎంసీఎం డిగ్రీ కళాశాల, ఆల్ఫా జూనియర్‌ కళాశాలలో, ఎస్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో టైం స్కూల్‌లో జవాన్లకు నివాళులర్పించారు. 

కొండమల్లేపల్లి : మండల కేంద్రంలోని స్థానిక క్రాంతి జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు వీర జవానుల జ్ఞాపకార్థం మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ దుండిగళ్ల అశోక్‌, అధ్యాపకులు  యాదయ్య, యాదయాచారి, యాదగిరి, మంజుల, రవికుమార్‌. విధ్యార్థులు తదితరులున్నారు. శివసేన యూత్‌ ఆధ్వర్యంలో వీర జవాన్ల జ్ఞాపకార్ధం స్థానిక బస్టాండ్‌ నుంచి చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలి నిర్వహించారు. 


logo