సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 15, 2020 , 01:22:38

సహకార ఎన్నికలకు సహకరించాలి

సహకార ఎన్నికలకు సహకరించాలి

చందంపేట : సహకార ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, నాయకులు సహకరించాలని ఎస్పీ రంగనాథ్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో చందంపేట, దేవరకొండ, డిండి మండలాలకు చెందిన ఎన్నికలో బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు స్థానిక సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదని సూచించారు. జిల్లాలో ఏ సహకార సంఘంలో లేని విధంగా చిత్రియాల, తిమ్మాపురం సహకార సంఘం పరిధిలో ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో ఓటు వేయడానికి రాకుడదన్నారు. ఆయా పోలింగ్‌ బూత్‌లలో ఓట్ల లెక్కింపు ముగిసినా రెండ్రోజుల పాటు పోలీస్‌ బందోబస్తు ఉంటుందని తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ చౌడగిరి, దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ 99 బెటాలియన్‌ డీఎస్పీ సంతోశ్‌కుమార్‌, సీఐ జనార్దన్‌గౌడ్‌, ఎస్‌ఐలు సందీప్‌కుమార్‌, కురుమయ్య, రవీందర్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ లాలు నాయక్‌, ఎంపీపీ పార్వతి, అనంతగిరి, సాదిఖ్‌, మల్లయ్య తదితరులు  పాల్గొన్నారు.


logo